Sunday 26 April 2015

Telangana Police:Launched a mobile App Hyderabad City Police Lost Report


సర్టిఫికెట్ ఏదైనా వెరీ వెరీ వాల్యుబుల్. అవి మిస్సైతే ఉండే పరేషాన్ అంతా ఇంతా కాదు. వాటిని తిరిగి తెచ్చుకునే టైంలో ఇబ్బందులు బోలెడు. ఇకపై ప్రాసెస్ ఈజీగా అయిపోయేలా.. కొత్త యాప్ అందుబాటులోకొచ్చింది. బోలెడు సర్టిఫికెట్లు. విలువైన పత్రాలు. రెగ్యులర్ లైఫ్ లో చాలా అవసరం. ఆస్తుల నుంచి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ల వరకు ఎన్నో. అవి మిస్సైతే నానా యాగీ అవుతం. భయం, టెన్షన్ తప్పదు. అలాంటి వాటిని వెనక్కి తెచ్చుకోవడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఇకపై ఆ పరేషాన్ ఉండదు. హైదరాబాద్ సిటీ పోలీసులు లాస్ట్ రిపోర్ట్ పేరుతో కొత్త యాప్ లాంచ్ చేశారు.


సర్టిఫికెట్ ఏది పోయినా.. దాని కోసం ఎలాంటి ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్.. ఈ లాస్ట్ రిపోర్ట్ యాప్ లో అప్లై చేస్తే సరిపోద్ది. మూడు రోజుల్లో వెరిఫికేషన్ చేసి మీ సేవకి రిపోర్ట్ పంపుతారు. మీ సేవ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోద్ది. ఈ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తో సంబంధించిన డిపార్ట్ మెంట్ కి వెళ్లి.. సర్టిఫికెట్స్ తెచ్చుకోవచ్చంటున్నారు అధికారులు. మొత్తం 27 రకాల సర్టిఫికెట్లకి ఈ యాప్ యూజవుతుందని చెబుతున్నారు. ఒక వేళ అప్లికేషన్ ని రిజెక్ట్ చేసినా.. ఎందుకు రిజెక్ట్ చేశామో చెబుతామంటున్నారు అధికారులు. ఇక ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి.. ఉపయోగించుకోవడానికి ఎలాంటి చార్జెస్ పే చేయాల్సిన పనిలేదంటున్నారు.

No comments:

Post a Comment